![]() |
![]() |

'బిబి జోడి' షో ప్రతీ శనివారం, ఆదివారం శ్రీముఖి యాంకర్ గా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. అయితే ఇందులో జడ్జ్ లుగా తరుణ్ మాస్టర్, సదా, రాధ చేస్తున్నారు. కాగా జోడిలుగా అఖిల్- తేజస్విని, సూర్య- ఫైమా, వసంతి- అర్జున్, చైతూ- కాజల్ ఉన్నారు. అయితే ఈ షోలో శనివారం ఎపిసోడ్లో ప్రాపర్టీ రౌండ్ జరిగింది. ఇందులో బెడ్ ప్రాపర్టీ తీసుకొని అఖిల్-తేజస్విని జోడి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన చైతూ- కాజల్ స్కూల్ బెంచ్ ప్రాపర్టీ తీసుకొని, స్కూల్ లైఫ్ లో అల్లరి చేసే పిల్లలుగా తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అలరించారు. వీరి పర్ఫామెన్స్ చూసి జడ్జ్ గా చేస్తున్న రాధ తన జడ్జ్ మెంట్ చెప్తూ స్కూల్ లైఫ్ లో తన అనుభావాలను పంచుకుంది.
రాధ మాట్లాడుతూ "నా 4th క్లాస్ లో లైనా అనే అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం సెకండ్ బెంచ్ లో ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఒక రోజు లైనా ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి శశికళ అని కూర్చుంది. ఆ రోజు మాకు ఒక టెస్ట్ ఉంది. నేను క్లాస్ కు వెళ్లి చూసి బయటకు వచ్చేశాను. అది చూసి మేడమ్ నన్ను పిలిచి 'ఏ ఎందుకు రాయలేదు టెస్ట్' అని అడిగింది. అక్కడ లైనా ఉండాలి. తను లేదు. నాకు నచ్చలేదు మేడమ్. అందుకే రాయలేదు టెస్ట్" అని చెప్పాను.
"అప్పటి నుండి ఇప్పటి వరకు నేను లైనాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె మా ఊళ్ళోనే, మా ఇంటి పక్కనే ఉంది. నేను మా ఊరికి వెళ్ళాలి. లైనాతో మాట్లాడాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి" అని అనుకుంటున్నాను అని రాధ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |